జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్‌తో పాటు సచిన్ పైలట్ కూడా చివరి వరకు పోటీపడ్డారు. చివరకు డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, హర్యానా మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హూడా సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు