HOME » VIDEOS » National

Video: కర్ణాటకలో రూ.5 కోట్లు విలువచేసే ఎర్రచందనం స్వాధీనం

ఆంధ్రప్రదేశ్13:46 PM December 22, 2018

కర్ణాటకలోని హోస్పేట సమీపంలో రూ. 5 కోట్ల విలువచేసే ఎర్రచందనం డంపును కడప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. అంతర్జాతీయ బడా స్మగ్లర్ నయాజ్‌ను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరు రూరల్ పరిధిలోని కంబాలిపురం, హోస్పేట తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కటిగెనహళ్లికి చెందిన బడా స్మగ్లర్ నాయజ్ పట్టుబడ్డాడు. అతడి స్వాధీనంలోని గోడౌన్‌ను తనిఖీ చేయగా అందులో ఐదు టన్నుల ఎర్రచందనం ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది

webtech_news18

Top Stories