సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నేవీ అప్రమత్తమైంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌక ద్వారా సముద్రంపై భద్రతను కట్టుదిట్టం చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గరుండి అన్నీ పర్యవేక్షించారు. రాత్రంతా ఆయన నౌకలోనే గడిపి నేవీ అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియం మెషిన్ గన్ కూడా ఆపరేట్ చేశారు.