పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా బటాలా ప్రాంతంలో ఉన్న బాణాసంచా తయారీ కర్మాగారంలో సాయంత్రం 4 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 20 మంది గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. పక్కనే ఉన్న కార్ వర్క్‌షాప్‌తో సహా సమీప భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీని వల్ల తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.