పుల్వామా ఉగ్రదాడిపై ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దుల్లో నక్కిన దాడుల సూత్రధారి రషీద్ ఘాజీని మట్టుపెట్టింది. అతనితోపాటూ... జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ కమ్రాన్‌ను కూడా హతమార్చింది. వీళ్లిద్దరూ పుల్వామా జిల్లా... పింగలాన్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లు తెలియడంతో CRPF జవాన్లు అక్కడకు వెళ్లారు. వెంటనే ఉగ్రవాదులు వాల్లపై కాల్పులు జరపడంతో... మేజర్ సహా నలుగురు జవాన్లు చనిపోయారు. వెంటనే కాల్పులను తిప్పికొట్టిన సైన్యం రెండు గంటలపాటూ పోరాడి... రషీద్ ఘాజీ, కమ్రాన్లను మట్టుపెట్టింది.