పుల్వామా ఉగ్రదాడిలో నిందితుడు జైషే మొహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రదాది సజ్జద్ ఖాన్ను పటియాలా కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. మార్చి 29 వరకు ఎన్ఐఏ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.