ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తూర్పు ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. నిన్నటి వరకు గాంగానది తీరం వెంబడి ప్రచారం నిర్వహించిన ఆమె..ఇప్పుడు గుళ్ల చూట్టూ తిరుగుతున్నారు. మీర్జాపూర్లోని వింధ్యావాసిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు భాదోహిలోని సీతా సమాహిత్ స్థల్లోనూ ప్రార్థనలు చేశారు.