Crime News | మహారాష్ట్ర (Maharashtra) లోని వార్ధా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. జనవరి 12, 2022న వార్ధా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆవరణలో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభ్యమయ్యాయి. దీంతో ఒక్కసారిగా నగరం అంతా ఉలిక్కిపడింది. ఈ అవశేషాలకు అక్రమ అబార్షన్లే కారణం అని అధికారులు భావిస్తున్నారు.