ఏపీ కాబోయే సీఎం వైఎస్ జగన్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. గురువారం ప్రమాణస్వీకారం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు ఆలయ ఈవో కోటేశ్వరమ్మతో పాటు వేదపండితులు జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పొట్లూరి వరప్రసాద్ సహా పలువురు నేతలు ఉన్నారు.