ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఏపీ సీఎం జగన్. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ అమలుచేయాలని ఆయన్ను కోరినట్లు జగన్ తెలిపారు. శనివారం జరిగే నీతి అయోగ్ సమావేశంలోనూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తానని చెప్పారు.