నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నల్లమల అడవులు అంతరించిపోతాయన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నల్లమల అడవులను నాశనం కానివ్వబోమని చెప్పారు. కేంద్రం బలవంతంగా తవ్వకాలు చేపడితే అందరం కలసి కొట్లాడదామన్నారు.