బడ్జెట్ సమావేశాలపై మీడియాతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన... పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు బడ్జెట్లో తమ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. పేదలు, దళితుల బడ్జెట్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నానన్నారు ప్రధాని. ఆర్థిక వృద్ధి, ఎన్పవర్మెంట్ ఆఫ్ పీపుల్ పై అధికంగా చర్చ కొనసాగుతుందన్నారు. చర్చలు ఫలప్రదంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు.