HOME » VIDEOS » National

Video : ఓడినందుకు తిక్కరేగింది.. డబ్బు వెనక్కివ్వాలని ఓటర్లపై దౌర్జన్యం..

తెలంగాణ16:17 PM January 29, 2019

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిత్రమైన ఘటన చోటు చేసుకుంది.పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. గ్రామంలోని ఓ వార్డులో కాంగ్రెస్ నాయకురాలు ఉప్పు హైమావతి పోటీ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు భారీగానే డబ్బు ఖర్చు పెట్టారు. ఒక్కో ఓటరుకు రూ.500-రూ.700 వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతా చేస్తే.. ఎన్నికల్లో ఆమెకు కేవలం 24 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో హైమావతి భర్త ప్రభాకర్‌కు తిక్క రేగింది. ఒక్కో ఓటుకు అంత ఖర్చు పెడితే.. ఇదా దక్కిన ఫలితం అని ఆగ్రహానికి గురయ్యాడు.అంతేకాదు, ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమ డబ్బు తమకు ఇచ్చేయాల్సిందిగా వారిని డిమాండ్ చేశాడు. తొలుత వారిని మర్యాదగా అభ్యర్థించిన ప్రభాకర్.. ఆపై డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ తతంగమంతా ఎవరో వీడియో తీయడంతో అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories