భద్రాచలంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై టీఆర్ఎస్ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అంతా కలిసి సదరు నాయకుడిపై దాడికి పాల్పడ్డారు. అతనికి దేహశుద్ది చేశారు.కార్మికుల దాడి నుంచి తప్పించుకుని అతను రోడ్లపై పరిగెత్తాడు. పోలీసుల రక్షణ వలయంలో అక్కడి నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.