Cyclone Fani Live Updates : ఉత్తరాంధ్ర నుంచీ బెంగాల్ వరకూ ఫొణి తుఫాను ప్రభావం చూపించడంతో 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా లక్షల మందిని తరలిస్తున్నారు. షెల్టర్హోంలలో తుఫాను బాధితులు తలదాచుకుంటున్నారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మందులు, ఆహారం, దుప్పట్లు, ఇతరత్రా అత్యవసర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. ఫొణి తుఫాను ప్రభావం ఒడిశాపై ఎక్కువగా కనిపిస్తోంది.