నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి బారులు తీరారు. ఓటర్లకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోధన్ డివిజన్లో మొత్తం 142 గ్రామ పంచాయతీల గాను 33 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా 109 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లో మొత్తం 192 గ్రామ పంచాయతీలు గాను 52 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 140 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి..