కరోనా కట్టడికై చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు. ఖమ్మం నుండి వివిధ రంగాల వ్యాపారులు, విద్యా, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 కోట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి అందజేశారు. ఈ క్రమంలోనే మమత వైద్య విద్య సంస్థ ఛైర్మన్, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ గారు కూడా భారీ మొత్తంలో రూ.25 ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఆ మొత్తాన్ని అందజేయగా సిఎం కేసీఆర్ మంత్రిని అభినందించారు.