అంగారక సంకట చతుర్థి సందర్భంగా సంగారెడ్డి రుద్రారం గణేష్ టెంపుల్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.