NTR Death Anniversary: సినిమాలు, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్ 26వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు బాలయ్య.. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలోని తల్లిదండ్రుల విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.