హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. కేసు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం అతడికి గాంధీ ఆస్పత్రిలో ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కరోనావైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని.. మన వాతావరణ పరిస్థితుల్లో ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేశారు. తమ్ములు, దగ్గు, జ్వరం ఉంటే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెప్పారు.