Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అటు సంసార జీవితం సాగిస్తూనే మరో వైపు సినిమాల్లో నటించారు. ఇక ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకున్నారు కాజల్. అది అలా ఉంటే కాన్పు తర్వాత కాజల్ మొదటి సారి తన తొలి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు ఆ ఫోటోను చూసిన నెటిజన్స్.