నిజామాబాద్ -స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి గా మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేసారు. ఎమ్మెల్సీగా ఆమె గెలుపు దాదాపు ఖరారు అయినట్లేనని, కవితను కేబినెట్లోకి కూడా తీసుకునే ఛాన్స్ ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే.. తెలంగాణలో తొలి మహిళా ఎమ్మెల్సీగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం... ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే... ఆమె రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.