ఆర్టీసీ కార్మిక సంఘం నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ప్రధాన కూడళ్లలో,డిపోల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది.ముందస్తు చర్యల్లో భాగంగా బంద్‌ను ప్రభావితం చేసే నేతలందరినీ అరెస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రొఫెసర్ కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీజేఎస్ నాయకులను నిర్బంధించారు.హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ సమ్మెలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ,ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ సహా పలువురు నేతలను జేబీఎస్ వద్ద అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.