HOME » VIDEOS » National

Video : మార్చి 20 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

తెలంగాణ20:14 PM March 06, 2020

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8న శాసనసభలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 9, 10, 15 తేదీలు అసెంబ్లీకి సెలవు దినాలు. మొత్తం 12 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 20న మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి... అవసరమైతే సమావేశాలను పొడగించాలని నిర్ణయించారు. మరోవైపు రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఎల్లుండి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా... వాటిపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.

webtech_news18

Top Stories