రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖను అందజేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ పది, నాలుగో పేరాను అనుసరించి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరారు. దేశాభివృద్ధిలో మోదీ వెంట నడవాలని తాము నిర్ణయించామన్నారు.