టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఐటీ అధికారులను బెదిరిస్తున్నవీడియో బయటకు వచ్చింది. కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఐటీ సోదాల పేరుతో తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రమేష్.