టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఏపీలో సెగలు రేపుతోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైజాగ్‌లో అడుగుపెట్టనీయబోమని వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు చంద్రబాబుకు వెల్కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలిచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పోలీసు రంగంలోకి చెదరగొట్టారు. ముందుజాగ్రత్తగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. వైసీపీ, టీడీపీ ఆందోళనల నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.