HOME » VIDEOS » National

Video : పునర్విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్20:29 PM January 01, 2020

ముఖ్యమంత్రి అనవసరంగా అమరావతిలో ఆందోళనలు జరిగేలా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అమరావతి ప్రజా రాజధాని అని, అక్కడ డీజీపీ కార్యాలయం,రాజ్‌భవన్,సచివాలయం,అసెంబ్లీ సహా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది పేరుతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. పునర్విభజన చట్టంలో ఒకే రాజధాని అని పేర్కొన్నారని,మూడు రాజధానుల ప్రస్తావన లేదని చెప్పారు. విశాఖలో వైసీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డారని,దానిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా కృష్ణాయపాలెంలో జరిగిన ఆందోళనలో చంద్రబాబు మాట్లాడారు.

webtech_news18

Top Stories