కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల తన్నుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. కడప నియోజకవర్గ పరిధిలోని సమీక్ష సమావేశంలో చంద్రబాబుకు సమస్యలు చెప్పుకున్నారు దళిత కార్యకర్తలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఉన్న అసంతృప్తిని అధినేత ముందు వెళ్లగక్కారు. దీంతో దళిత కార్యకర్తలు తనపై ఆరోపణలు చేస్తున్న సమయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన మనుషుల దాడికి దిగారు. సుబ్బయ్య అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టారు.