ఢిల్లీ జరిగిన హింసాకాండపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పరిణామాలను రాంనాథ్ కోవింద్ కు వివరించారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని కోరింది కాంగ్రెస్. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే అల్లర్లు జరిగాయని సోనియా గాంధీ మండిపడ్డారు.