ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రోజున ఆయన చేపట్టిన దీక్ష ఏడోరోజుకు చేరింది. కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటును డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగాణ్ సిద్ధిలో గత నెల 30 నుంచి అన్నా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో... ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు.