తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ ప్రత్యక్షమయ్యారు. ఈ రోజు వెలువడుతున్న ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుపొందడంతో ఆయన ఇల్లు కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. అక్కడికి వచ్చిన కార్యకర్తలకు స్వీటు తినిపించి వారి నోటిని తీపి చేయడమే కాకుండా, వారి అభిమానాన్ని చూరగొన్నారు.