అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఎం జగన్ సచివాలయానికి వెళ్లారు. ఆయన వెళ్లే దారిలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ఆందోళనకారులను రానీయకుండా అడ్డుకున్నారు.