కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆయన అక్రమంగా బాంబేలోని జూహు ప్రాంతంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. నారాయణ రాణే నిబంధలను విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు (ఎఫ్‌ఎస్‌ఐ) తెలింది. అంతే కాకుండా ఆయన, ఫ్లోర్ స్పెస్ ఇండెక్స్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించి ఇంటిని నిర్మించారని పేర్కొంటూ దాన్ని వెంటనే కూల్చివేయాలని ముంబై పౌరసరఫరాల సంస్థను బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
రెండు వారాల వ్యవధిలో అనధికార భాగాలను కూల్చివేసి, ఒక వారం తర్వాత కోర్టుకు సమ్మతి నివేదికను సమర్పించాలని కోర్టు BMCని ఆదేశించింది. అంతే కాకుండా.. విచారణ చేపట్టిన హైకోర్టు బెంచ్ మిస్టర్ రాణేపై ₹ 10 లక్షలు విధించింది. ఆ మొత్తాన్ని రెండు వారాల్లోగా మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. దీనిపై నారాయణ్ రాణే తరపు న్యాయవాది శార్దూల్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఆరు వారాల పాటు హైకోర్టు తన ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరారు. అయితే బెంచ్ దానిని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనతో రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.
ఇదిలా ఉండగా యూపీలో ఏకంగా సీఎంకు ఒక వ్యక్తి గుడికట్టాడు.
ప్రముఖ వ్యక్తులపై ఉండే అభిమానాన్నిప్రత్యేక పద్ధతుల్లో చూపిస్తుంటారు వారి అభిమానులు. మన దేశంలోప్రముఖుల కోసం ప్రత్యేకంగా గుడి కట్టించిన సందర్బాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)కు గుడి కట్టించి పూజలుచేస్తున్నాడు ఒక వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. ప్రభాకర్ మౌర్య అనే 32 ఏళ్ల ఆధ్యాత్మిక గాయకుడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)పై అభిమానంతో ఏకంగా ఒక ఆలయం (Temple) కట్టించారు. ఈ ఆలయంలో యోగి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు కూడా చేస్తున్నారు.
అయోధ్య (Ayodhya)లో రామజన్మభూమి వద్ద రామమందిరాన్ని చూడాలనే బలమైన కోరిక చాలామంది హిందువులలో ఉంది. వారిలో ప్రభాకర్ మౌర్య ఒకరు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే వ్యక్తికి గుడి కట్టించి, పూజించాలని 2015లోనే మౌర్య ప్రతిజ్ఞ చేశారు. కాగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో రామమందిరం నిర్మితమవుతోంది. దీంతో రామమందిరాన్ని ఆదిత్యనాథ్ నిర్మిస్తున్నారని ఆయనకు ఒక గుడి కట్టించారు. రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే మౌర్య గుడి కట్టించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు.