ఐదో విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమేథీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లిన వ్యక్తిని బయటకు పంపించేశారని.. దాంతో సకాలంలో చికిత్స అందక అతను చనిపోయాడని అన్నారు. రాహుల్ గాంధీ ఆ ఆసుపత్రి ట్రస్ట్ మెంబర్‌గా ఉన్నారని.. పేషెంట్‌కి కేంద్రం అందించిన ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండటం వల్లే చికిత్స నిరాకరించారని ఆరోపించారు. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ అమాయకుడిని బలిచేశారని.. రాహుల్ గాంధీకి కనీస మానవత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.