లోక్‌సభ ఎన్నికల పర్యటనలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్నికల పర్యటనలో ఉన్న ప్రియాంకగాంధీ ఉండగా పాములు పట్టేవాళ్లు ప్రియాంక కంట పడ్డారు. ఇంకేముంది..వెంటనే అక్కడి వెళ్లి కూర్చొని పాములతో ఆటలాడారు ప్రియాంక. ఇది చూసిన అక్కడున్న వాళ్లంతా అమ్మో ప్రియాంకకు ఎంత ధైర్యం అంటూ చర్చించుకున్నారు.