ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు పడరాని పాట్లు పడుతుంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక కొత్త ఫీట్ చేశారు. తనకు అభివాదం చేస్తున్న జనాన్ని కలిసేందుకు బారికేడ్ దూకి మరి వెళ్లారు.