Lok Sabha Elections 2019: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆయన తల్లి హీరాబెన్ మోదీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలకు చేతులెత్తి దండం పెట్టారు.