జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో పోలీసులు షాక్ ఇచ్చారు. పవన్‌తో పాటు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మందడం వెళ్లే దారిలో పవన్‌ను పోలీసులు అడ్డగించారు. కృష్ణయపాలెం నుంచి మందడం మీదుగా వెళ్తున్న పవన్‌ను పోలీసులు అడ్డు తగిలారు. వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద పవన్ ను పోలీసులు నిలిపివేశారు. సచివాలయంలో సీఎం ఉన్నందున.... సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. లేకుంటే నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. దీంతో పవన్ నేలపైన కూర్చొని పోలీసుల తీరుకు నిరసనకు దిగారు. రోడ్డుపైనే పవన్ ధర్నా నిర్వహించారు. సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. మరోవైపు మందడం గ్రామాల ప్రజలు మాత్రం పవన్ తన గ్రామంలో రావాలని పట్టుబడుతున్నారు. దీంతో పోలీసులకు జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాలినడకన పవన్ బయల్దేరారు.