విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడ బెంజ్ సర్కిల్లో జేఏసీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత చంద్రబాబునాయుడు, అఖిలపక్ష నేతలు పాదయాత్రగా వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, అఖలపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.