Ysrcp Kotam Reddy Sridhar Reddy Arrest : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు అయ్యారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఈ ఉదయం అరెస్టు చేసి తీసుకెళ్లారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని MPDO సరళ... ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సరళ కంప్లైంట్‌పై ఎంక్వైరీ జరిపిన పోలీసులు... అది నిజమే అని తేలడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇందుకోసం పోలీసులు శనివారం రాత్రి నుంచీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి దగ్గర వెయిట్ చేశారు. రాత్రంతా ఎదురుచూసిన పోలీసులు... తెల్లారి బయటకు వచ్చిన శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వ్యక్తిగత విషయాల్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న కోటంరెడ్డి... తాను ఏ తప్పూ చెయ్యలేదని అన్నారు. విచారణలో నిజాలు బయటికొస్తాయని అన్నారు.