దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మార్చి 1న అమెరికాలో 75 కేసులు నమోదు కాగా.. నేటికి ఆ సంఖ్య 14వేలకు చేరిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్తో పాటు ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్, ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కరోనా నివారణకు రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలను ప్రధాని ఆరా తీశారు.