ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంపై రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని తాను హెచ్చరిస్తున్నానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో ఆ పథకాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'జై జవాన్, జై కిసాన్' అనే నినాదం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని రైతులను ఈ సందర్భంగా మోదీ కోరారు.