మధ్యప్రదేశ్ సీఎం మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్కు చేదు అనుభవం ఎదురయింది. కాంగ్రెస్ సభలో ఓ యువకుడు మోదీని పొగడడంతో అవాక్కయ్యారు. భోపాల్లో జరిగిన సభకు యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. ఆ సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ..''ప్రతి ఒక్కరి అకౌంట్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు..ఎవరికైనా వచ్చాయా? '' అని అడిగారు. ఐతే ఓ యువకుడు చెయ్యి పైకెత్తడంతో అతడిని స్టేజి మీదకు పిలిచి ప్రశ్నించారు దిగ్విజయ్. ఐతే సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులు చంపేశాడని ఆ యువకుడు మోదీపై ప్రశంసలు కురిపించడంతో డిగ్గీ రాజా షాకయ్యారు. వెంటనే తేరుకున్న అతని అనుచరులు ఆ యువకుడిని స్టేజీ మీద నుంచి గెంటేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.