ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. జగన్ ఇచ్చిన హామీలకు, ప్రభుత్వ పాలనకు సంబంధం లేదన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేని సమయంలో ప్రాజెక్టులు రద్దు చేసుకుంటూ వెళ్లడం వల్ల పరిశ్రమల్లో నమ్మకం పోతుందన్నారు. దీని వల్ల రాష్ట్రాభివృద్ధికి కూడా విఘాతం కలుగుతుందన్నారు. ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ పవన్ కళ్యాణ్ బుక్ లెట్ విడుదల చేశారు.