ఏపీలో అమరావతి కోసం ఆందోళనలు జరుగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీలో పొత్తు కుదిరిన అనంతరం అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం ఏం నిర్ణయించుకున్నా అది కుదరదని.. వాళ్లు అనుకోవడమే తప్ప వాస్తవానికి తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు జనసేనాని. మెజార్టీ ఉంది కదా అని.. పద్దతి పాడూ లేకుండా చేస్తే.. ఊరుకోబోమని హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆంధ్రా ప్రజలు కోరుకుంటేనే అమరావతి వచ్చిందని స్పష్టం చేశారు. వైసీపీ నిర్ణయించుకున్నంత మాత్రం జరిగిపోదు. వాస్తవ రూపానికి తీసుకెళ్లలేరు. ఒకవేళ జరిగినా మేం చూస్తూ ఊరుకోం. రోడ్ల మీదకు వస్తాం. ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. తెగించే నాయకత్వం ఉంది. మెజార్టీ ఉంది కదా అని పద్దతీ పాడు లేకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదు. జగన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే కుదరదు. 5 కోట్ల మంది ఆంధ్రులు కోరకుంటేనే అమరావతి వచ్చింది.