జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల వల్ల దేశానికి ఒరిగిందేం లేదని నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 60 ఏళ్లుగా దేశంలో కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే పాలించాయని.. అప్పుడేం చేయలేని పార్టీలు .. ఇంకా పేదప్రజలకు ఏదో చేస్తామని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దేశం మొత్తం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఆకర్షితమవుతోందన్నారు.