నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 41 డివిజన్ లో బీజేపీ ఎంపీ అర్వింద్ కు పోలీసులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలపై సైతం దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎస్ ఐ సంతోష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.