రాజకీయాల్లో లబ్ది పొందేందుకే బయోపిక్‌లు నిర్మిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు విమర్శించారు. న్యూస్ 18తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీకి ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను పెట్టిన పార్టీలోనే ఆయన వచ్చి చేరారని.. ఎన్టీఆర్‌ను ఆయన కుమారులే చంపేశారని, తాను మోసం చేశానన్నది నిజం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబును మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే ఈ బయోపిక్‌ల పేరిట జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.