NRC | Amit Shah | దేశంలో ఉన్న అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేసేందుకు దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల జాబితా(ఎన్ఆర్సీ) ను కచ్చితంగా నిర్వహించి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం తాము ఈ హామీని అమలు చేసి తీరుతామని ఆయన పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. దీనిపై నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 2024 లోగా ఎన్ఆర్సీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.